Drone Attack Targets Iraq PM, Who Escapes Unhurt | ఇరాక్ పీఎం ముస్తఫా అల్ ఖదీమ్ నివాసంపై డ్రోన్ దాడి

Share this & earn $10
Published at : November 10, 2021

ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కదిమి................... డ్రోన్ బాంబు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇరాక్ ప్రధాని అధికారిక నివాసమే లక్ష్యంగా...... డ్రోన్ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి నుంచి ప్రధాని తప్పించుకున్నారని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని
అధికారులు తెలిపారు. ఈ డ్రోన్ దాడిలో ఇరాక్ ప్రధాని భద్రతా సిబ్బందిలో ఏడుగురు గాయపడ్డారని వెల్లడించారు. వీరోచిత భద్రతా బలగాల దృఢత్వం ముందు ఏ రాకెట్లు తనను ఏమీ చేయలేవని.... తాను క్షేమంగా ఉన్నానని ముస్తఫా అల్ కదిమి ట్వీట్ చేశారు. విదేశీ రాయబారులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండే... పటిష్ఠ భద్రతా వ్యవస్థ ఉన్న గ్రీన్ జోన్ లో బాంబు దాడి కలకలం రేపింది. ఈ బాంబు దాడి మూలాలను కనుగొనేందుకు... భద్రతా బలగాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఇరాక్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇంకా ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తూ.... మిలీషియా మద్దతుదారులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరగగా.... ఒక నిరసనకారుడు మరణించాడు. చాలామంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- Drone Attack Targets Iraq PM, Who Escapes Unhurt | ఇరాక్ పీఎం ముస్తఫా అల్ ఖదీమ్ నివాసంపై డ్రోన్ దాడి
ETVETV TeluguETV NewsVideo